నేటి కాలం లో చాల సమస్యలు వస్తున్నాయి. ఇటుంవటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే డైట్ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యం మరెంత మెరుగు పడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తిమీర శరీరం నుంచి సోడియంను బయటకు తొలగించడానికి సహాయ పడుతుంది. అలానే ఆహారానికి తాజాదనాన్ని ఇస్తుంది. కొత్తిమీరని తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, అధిక రక్తపోటును తగ్గించడం లో కూడా సహాయ పడుతుంది. కాబట్టి మీ డైట్ లో దీనిని చేర్చండి.
ఇది ఇలా ఉండగా పుదీనా కూడా ఒంటికి మంచిది. ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. సాధారణంగా వేసవి కాలంలో మంచి ఔషధంగా పని చేస్తుంది పుదీనా. దీనిని నిమ్మరసం, మజ్జిగ ఇలా ఎందులోనైనా వేసుకుని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీని వల్ల ఒత్తిడిని కూడా తగ్గించుకో వచ్చు. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి కూడా ఇది సహాయపడతాయి. రోజ్ మేరీ కూడా తీసుకోవడం మంచిదే. గుండె పోటు ప్రమాదాన్నిఇది తగ్గిస్తుంది. వీలైనంత వరకు వీటిని వంటల్లో వాడండి. అనేక సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు