నోటా, ‌కామ్రేడ్ effect.. పేరు మార్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ

-

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం మంచి జోరు మీద ఉన్నాడు. యూత్‌లో అదిరిపోయే క్రేజ్ ఉన్న యువ హీరో విజ‌య్‌. తన ఆటీట్యూ డ్, సినిమాలతో ఈ తరం యూత్‌కు చాలా దగ్గరయ్యాడు విజయ్. ఇక అమ్మాయిల్లో ఈయ‌న‌కు ఉన్న ఫాలోంగ్ అంతా ఇంతా కాదు. అలాగే ఎప్పుడూ కూడా డిఫరెంట్ సినిమాల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. ప్ర‌స్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు విజ‌య్.

ఇదిలా ఉంటే.. ఈ త‌రం కుర్రాళ్లకు రోల్ మోడల్‌గా ఎదిగిన విజ‌య్ తన పేరులో మార్పు చేసుకున్నాడు. ‘దేవరకొండ విజయ్ సాయి’గా తన పేరులో మార్పు చేసుకున్నాడు. తన తాజా చిత్రమైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకి గాను ఆయన ఇదే పేరును వేసుకున్నాడు. రీసెంట్ గా వదిలిన టీజర్ వలన ఈ విషయం స్పష్టమైంది. ఈ మ‌ధ్య విడుద‌లైన నోటా, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌యాలు సాధించ‌లేదు. కెరియర్ పరంగా మరింత కలిసి రావాలనే సెంటిమెంట్‌తో ఆయన ఇలా చేసి ఉంటాడని అనుకుంటున్నారు అభిమానులు.

అది అలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నాలుగు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా రాశీ ఖన్నా, కేథరిన్ త్రేసా,ఐశ్వర్య రాజేశ్ చేస్తున్నారు. క్రాంతి మాధవ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇక ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ డ్యాషింగ్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` సినిమా చేయ‌బోతున్నాడు.ఈ సినిమా కూడా స్రిప్ట్ పనులు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే పూరి-చార్మి ముంబైలో మకాం వేసి నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news