విదేశాల నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ….

-

పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇదివరకే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ , ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు 100 కోట్ల క్లబ్బులో చేరిన పలు చిత్రాలను తెరకెక్కించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ పరశురామ్ ఆనందం వ్యక్తం చేస్తూ మా షూట్ కంప్లీట్ అయిందంటూ ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news