విజయ్ దేవరకొండ బూతులు.. ఫైర్ అవుతున్న నెటిజన్స్

-

విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఇక ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు చిత్ర యూనిట్.ప్రమోషన్స్ సందర్భంగా విజయ్ దేవరకొండ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్పై మృణాల్ ఠాకూర్ను కూర్చోబెట్టుకుని విజయ్ వేదిక వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో బైక్కు కొంతమంది అడ్డుగా ఉన్నారు. దీంతో విజయ్ జరగండి రా నీ అబ్బా అని నోరు జారారు. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ఫైర్ అవుతున్నారు. పబ్లిక్ ఆ మాటలేంటీ? అని వారు కామెంట్లు చేస్తున్నారు.

కాగా,ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు 100 కోట్ల క్లబ్బులో చేరిన పలు చిత్రాలను తెరకెక్కించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version