బ్రేకింగ్ : తమిళ రాజకీయాల్లోకి విజయ్.. పార్టీ ప్రకటన ?

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు అలనాటి ఎన్టీఆర్ నుంచి ఏఎన్నార్ దాకా నిన్న మొన్నటి పవన్ కళ్యాణ్ నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ దాకా ప్రజలకు ఏదో ఒకటి చేయడానికి ముందుకు వచ్చిన వారే. వారి గెలుపోటములు పక్కనపెడితే ఎంతో విలాసవంతమైన జీవితాన్ని ఎన్నో కోట్ల రూపాయల సంపాదనని పక్కనపెట్టి ప్రజల కోసం ముందుకు వస్తున్నారు. తాజాగా అదే కోవలో తమిళ హీరో విజయ్ కూడా నడుస్తున్నాడు.

తాజాగా ఆయన పార్టీ పేరుని ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. గతంలో ఉన్న విజయ్ పీపుల్స్ మూమెంట్ ని ఒక రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయించి నట్టుగా సమాచారం అందుతోంది ఈ పార్టీకి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకంగా విజయ్ పార్టీ పేరు పెట్టే అవకాశం ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే ఈయన నటించిన మాస్టర్ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. లోకేష్ కనగారాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈయన నటించిన బిజిల్ సినిమా రిలీజ్ సమయంలో ఈయన మీద ఐటీ సోదాలు చేయించడం పెను సంచలనంగా మారింది.