‘వారసుడు’ ట్రైలర్ అదుర్స్‌..

-

దళపతి విజయ్‌కు కోలీవుడ్‌లో భారీ మార్కెట్ ఉంది. తెలుగులో కాస్త తక్కువగా ఉంటుంది. అయితే దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఇద్దరూ కూడా తమిళ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తీసినట్టుగా చెబుతున్నారు. ఇది పక్కా తమిళ సినిమా అని, విజయ్ సినిమా అని చెబుతూనే వచ్చారు. అయితే.. ఈ సినిమా, తమిళ … తెలుగు భాషల్లో ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో హీరో ఉమ్మడి కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబం పాలిట విలన్ గా తయారవుతాడు ప్రకాశ్ రాజ్. అతన్ని ఎదిరించి తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడనేదే కథ అనే విషయం ఈ ట్రైలర్ వలన అర్థమవుతోంది. విజయ్ సరసన నాయికగా రష్మిక సందడి చేయనున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ .. సుమన్ .. ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శ్యామ్ .. జయసుధ .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ నుంచి వచ్చిన పాటల్లో రంజితమే సాంగ్ బాగా అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version