కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపి, వచ్చా.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు

-

విధాతః బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడిగా నియామితులైన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన బాధ్యతలు స్వీకరించారు. బండి సంజయ్ నుండి కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ ఇంచార్జీలు ప్రకాశ్ జవదేకర్‌, తరుణ్ చుగ్‌, బన్సల్‌, జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ, మురళీధర్‌రావు, మాజీ సీఎం ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, రఘునందన్ రవు, విజయశాంతి, ఎంపీలు డి.అరవింద్‌, సోయం బాపురావు, రవిందర్ నాయక్‌, మాజీ ఎంపీలు జి.వివేక్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల నాయకులు భారీ సంఖ్యలో హాజరై కిషన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

విజయశాంతి శుక్రవారం చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తెలంగాణను వ్యతిరేకించిన వారితో తనకు వేదిక పంచుకోవడం ఇష్టంలేక మధ్యలో వచ్చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ నేత, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆయన రావడంపై రాములమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాను కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపానని విజయశాంతి చెప్పారు. అయితే అదే కార్యక్రమంలో కిరణ్ కుమార్ ఉండటంతో త్వరగా వచ్చానని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్‌తో స్టేజ్‌పై ఉండటం నచ్చలేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version