నారా లోకేష్ కు టైమ్ దగ్గర పడిపోయింది : విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

నారా లోకేష్ పని ఐపోయిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ బరితెగింపు చూస్తుంటే…MLC పదవీకాలం గడువు దగ్గర పడుతోందని.. తర్వాత ఏ పదవి దక్కేది లేదని చురకలు అంటించారు. “అందుకే తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడు. అమరావతి పేరుతో లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక, అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడు పప్పు.” అంటూ మండిపడ్డారు.

ysrcp mp vijayasai reddy

“రంగా హంతకులకు వైజాగ్‌ను కానుకగా రాసిచ్చి భూదందాలకు, మద్యం సిండికేట్లకు లైసెన్సిచ్చిందే చంద్రబాబు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రకటనకు ముందే వేల ఎకరాల భూములను కొనిపించింది ఎవరు? ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను ఏదో జరుగుతోందంటూ బెదరగొడుతున్నారు తండ్రీ, కొడుకులు.” మంటూ మరో ట్వీట్ లో రెచ్చిపోయారు. వీర్రాజు గారు చాలా ఒత్తిడిలో ఉన్నట్టున్నారని… అది అధిష్టానం నుంచో చంద్రబాబు నుంచో తెలియటం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మార్కు చౌకబారు విమర్శలు వీర్రాజు గారి నోటి నుంచి రావడం ఆశ్చర్యకరం… బిజెపిని ఏళ్లపాటు తన గుప్పెట్లో పెట్టుకుని ఎదగకుండా తొక్కిపట్టాడు బాబు. మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version