నాలుగు రోజుల క్రితం.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ కేబినేట్ విస్తారణపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ అనగానే సిఎం జగన్ ఎవరికి ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరిని సిఎం తమ పదవులకు ఎంపిక చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇద్దరి పేర్లను బీసీల నుంచి సిఎం జగన్ ఎంపిక చేసారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా… బుగ్గన రాజేంద్రనాథ్ తన పదవిపై ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది.
బుగ్గనను తొలగిస్తే ఆయన స్థానంలో శిల్పా చక్రపాణి రెడ్డి పేరు పరిశీలనలో కి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న తరుణంలో బుగ్గన మాత్రమే ఆ శాఖ నిర్వహించడమే… కాకుండా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులతో మాట్లాడి నిధులు సమీకరించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో మరో చర్చ జోరుగా సాగుతోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ప్రస్తుతం జగన్… వైసిపి పార్టీ బాధ్యతలు అప్పగించారు.
ఆయనను తాడేపల్లి లోనే ఉండాలని కోరారు. అనుబంధ సంఘాలకు ఇంచార్జి గా నియమించారు. రానున్న రెండు సంవత్సరాల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవహారాలు జయ సాయికి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ ఇవ్వని పక్షంలో ఎమ్మెల్సీ నీ చేసి ఆర్థిక మంత్రిగా తీసుకుంటారని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విజయసాయిరెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటే బుగ్గన కు ఉద్వాసన పలకడం ఖాయమని చెబుతున్నారు.