తెలంగాణలో తగ్గనున్న బీరు ధరలు..బాటిల్ కు రూ.20 నుంచి రూ.30 తగ్గింపు !

-

తెలంగాణ మందుబాబులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీర్లపై పది రూపాయలు తగ్గించిన కేసీఆర్ ప్రభుత్వం… ఇప్పుడు మరోసారి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి నేపద్యంలో మద్యం ధరలను ఎక్సైజ్ శాఖ 20 శాతం పెంచింది. అయితే ధరలు పెరిగిన అప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

అయితే.. మద్యం అమ్మకాలను పెంచేందుకు ఇటీవల పది రూపాయల మేరకు తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ… మద్యం అమ్మకాలు పెరగలేదని రాష్ట్ర ప్రభుత్వ నివేదికలో తేలిపోయింది. ఇంకా ఎలాగైనా మద్యం అమ్మకాలను భారీగా పెంచాలనే నేపథ్యంలో.. మరోసారి బీర్లపై ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క బీరుపై 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు తగ్గించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో… ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ధరలు అమలు చేయాలని కూడా రంగం సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version