ఆనందయ్య మందుపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆనందయ్య మందుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వారియర్స్ కు ఆనందయ్య మందును విశాఖలో గిఫ్ట్ గా ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రెంట్ లైన్ వర్కర్స్ కు ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీ చేశారు విజయసాయిరెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రెంటిలైన్ వర్కర్స్ 22 వేలమంది ప్రాణాలు తెగించి విశాఖలో పని చేసారని.. ఆనందయ్య మందుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తేలిందని పేర్కొన్నారు. మొదటి దశలో 22 వేల మంది ఫ్రెంట్ లైన్ వర్కర్స్ కు అందిస్తున్నామన్నారు.

రెండవ విడతలో జిల్లాలో ఉన్న ప్రజలు అందరికి ఆనందయ్య మందు అందిస్తామని.. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కరోనా నియంత్రణ చర్యలు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టారన్నారు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆనందయ్య మందు చక్కగా పనిచేస్తుందని.. నగరంలో 20 వేల మందికి పైగా ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆనందయ్య మందుపై ఎలాంటి అపోహలు వద్దని…ఆనందయ్య ముందు నేను కూడా వాడానని తెలిపారు.