మాన్సాస్ ట్రస్టు భూములపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్ ట్రస్టులో 14 వేల ఎకరాల భూములు ఉన్నాయని… ఆ భూమిని రక్షించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. అలాగే ఈ మాన్సాస్ ట్రస్ట్ లో 14 విద్యాసంస్థలు ఉన్నాయని.. పదేళ్లుగా ఆ విద్యాసంస్థల్లో ఆడిటింగ్ జరగలేదన్నారు. ఆడిటింగ్ లో అవకతవకలు ఉన్నట్లు తేలితే సీఎం జగన్ చర్యలు తప్పకుండా తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. సింహాచలం భూముల రక్షణకు ప్రహరీగోడ నిర్మిస్తామని పేర్కొన్నారు.
బొబ్బిలి, విజయనగరం రాజులు ఇచ్చిన డిక్లరేషన్ లో లేని భూములను తప్పకుండా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని హెచ్చరించారు. ట్రస్ట్ భూములను కోర్టు పర్మిషన్ తోనే అమ్మాలని… 115 ఎకరాలను చట్ట విరుద్ధంగా ఇప్పటికే అమ్మేశారని విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. త్వరలోనే పంచ గ్రామాల సమస్య పరిష్కరిస్తామని.. దశాబ్దాలుగా పంచ గ్రామాల సమస్య ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి.