రాష్ట్రపతి కోవిందును కోవిడ్ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన వీడియోను షేర్ చేశారు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. రాష్ట్రపతి మాన్యవర్ శ్రీ రామనాథ్ కోవింద్ గారిని పట్టుకుని కోవిడ్ అన్నారు అల్జీమర్స్ చంద్రం బాబాయ్. చిప్ అరికాలును దాటి పాతాళానికి పడిపోయిందడర్రా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.
ప్రపంచంలో ఎక్కడైనా మీటింగ్ అయపోయాక జనం కుర్చీలపై నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లిపోతారు. మీ చంద్రబాబు మీటింగ్ లో అయితే కుర్చీలు ఎత్తుకెళ్తారు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి మ్యాజిక్ చేయాలనుకుంటే ఎలా? ఆంధ్రజ్యోతిని ‘అంధ’ మీడియాగా మార్చేశావు కదయ్యా! అంటూ మరో ట్వీట్ లో రెచ్చిపోయారు. మంగళగిరిలో ఈరోజు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భారత రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గారు సమావేశమయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించిందని, అందరూ బలపర్చాలని పార్టీ ప్రతినిధులను సీఎం జగన్ గారు కోరారన్నారు.
రాష్ట్రపతి మాన్యవర్ శ్రీ రామనాథ్ కోవింద్ గారిని పట్టుకుని కోవిడ్ అన్నారు అల్జీమర్స్ చంద్రం బాబాయ్. చిప్ అరికాలును దాటి పాతాళానికి పడిపోయిందడర్రా! pic.twitter.com/iyMQ7hhNxR
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 13, 2022