సినిమా ఒకేగానీ.. కండిష‌న్స్ అప్లై అంటున్న విజ‌య‌శాంతి..

-

ఒకటి రెండు కాదు.. దాదాపు 13 ఏళ్ళ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది విజయశాంతి. అప్పుడెప్పుడో నాయుడమ్మ సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్రలో నటించింది లేడీ సూపర్ స్టార్. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న
సరిలేరు నీకెవ్వరులో చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఇన్నేళ్ళ తర్వాత ఆమె నటించడానికి ఒప్పుకుందంటే కచ్చితంగా అందులో ఎంత విషయం ఉందో అర్థమైపోతుంది. దానికి తోడు ఆమె కారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా అర్థం చేసుకోవచ్చు.

భారతి పాత్రలో ఈమె ఈ సినిమాలో కనిపించబోతుంది. మహేష్ కు సమానంగా ఈమె రోల్ ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే ఈమెకు మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయట. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు విజయశాంతి కోసం ఆఫర్స్ ఇస్తున్నారట. ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉందని టాక్. అయితే తాను సినిమాలు ఒప్పుకోవాలంటే రెండు కండిషన్స్ మాత్రం తప్పనిసరి అని చెబుతుందట లేడీ అబితాబ్‌. వాటికి ఓకే అంటేనే తాను సినిమాకు ఓకే చెబుతానని, లేదంటే నో అంటూ గట్టిగానే డిమాండ్ చేస్తుందట.

ఇక ఆ కండిష‌న్స్ ఏంటో చూస్తే.. తనకు స్టార్ హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలన్న‌ది మొద‌టి కండిష‌న్ అయితే.. రెండోది సినిమాలో కీ రోల్ అయితేనే చేస్తానని చెప్పిందట. దీంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు మైండ్ బ్లాక్ అయింద‌ట‌. రెమ్యూనరేషన్ పరంగా పరవాలేదు కానీ మరి కీ రోల్, సినిమాలో ప్రాముఖ్యత ఉన్న రోల్ అంటేనే కష్టం అని అంటున్నారు. ఏదైమైనా విజ‌య‌శాంతి ఇలాంటి కండిష‌న్స్ పెడితే ముందు ముందు వ‌చ్చే అవ‌కాశాల‌కు బ్రేక్ వేసిన‌ట్టు అవుతుంది అన్న టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news