బిజెపిలో జగన్ చిచ్చు పెట్టారా…?

-

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అంశం ఒక్క తెలుగుదేశం పార్టీనే కాదు బిజెపిని కూడా ఇబ్బంది పెడుతుంది. రాష్ట్ర బిజెపి నేతలు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కొన్ని రోజులుగా జగన్ నిర్ణయాలను తీవ్రంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రాజధానుల విషయంలో ఆయన మౌన దీక్షకు కూడా కూర్చున్నారు.

ఈ నేపధ్యంలో ఇటీవల కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజధానులు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని బిజెపి రాష్ట్ర నేతలు విమర్శలు చేసుకోవడం తగదు అని వ్యాఖ్యానించారు. అటు బిజెపి రాజ్యసభ ఎంపీ కూడా అది రాష్ట్ర పరిధిలోని అంశమే అన్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా బోస్టన్ కమిటి నివేదిక విషయంలో కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

జగన్ ఏర్పాటు చేసిన కమిటీలు అన్ని కూడా ఆయన మానస పుత్రికలు అంటూ వ్యాఖ్యలు చేసారు. జగన్ చెప్పినవే జిఎన్ రావు కమిటి చెప్పిందని, తాజాగా బోస్టన్ కూడా అదే చెప్పిందని, జగన్ సిఎం అయినా సరే ఆయనకు రాజదానులపై నిర్ణయం తీసుకునే అధికారం లేదంటూ వ్యాఖ్యానించారు. అందరు ఒప్పుకున్నాకే అమరావతి ఏర్పాటు జరుగుతుందని, ఇప్పుడు ఏ విధంగా మారుస్తారని ఆయన ప్రశ్నించారు. దీనితో ఇప్పుడు రాజధాని విషయంలో బిజెపి నేతల మధ్య చిచ్చు పెట్టినట్టే కనపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news