కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ మొత్తాన్నీ దోచుకుంటోంది – విజయశాంతి

-

కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తెలంగాణ మొత్తాన్నీ దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయశాంతి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి తాండవం చేస్తోంది. ఇదంతా బయట పడకుండా ఉండడానికే తాజాగా రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టకుండా కేసీఆర్ సర్కార్ రహస్య ఉత్తర్వులు ఇచ్చిందని మండిపడ్డారు. ఇందుకోసం రెండు నెలల కిందటే జీవో నెం.51ని జారీ చేసినప్పటికీ ఇన్నాళ్లూ బయటపెట్టలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ… మా బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ జీవో వెలుగులోకి వచ్చిందన్నారు.

ఢిల్లీ లిక్కర్‌‌ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు రావడంతోనే సీబీఐ విచారణకు ‘నో’ చెప్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో 51ని ఇచ్చింది. ఆగస్టు 30న ఈ జీవో విడుదలైంది. కవిత మెడకు లిక్కర్ స్కాం ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళనతోనే రాష్ట్రంలోకి సీబీఐ అడుగుపెట్టకుండా కేసీఆర్ సర్కార్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అక్రమాలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు దర్యాప్తు సంస్థలకు ఇటీవల పలు ఫిర్యాదులు అందాయి. వాటిపైన కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు దిగే అవకాశముందని గుర్తించే సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఇది చాలదా, తప్పు ఎవరు చేశారో ప్రజలకు అర్థం కావడానికి… మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వారంతా మీకు తగిన సమాధానం చెప్పక మానరని వివరించారు విజయశాంతి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version