నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. అంతేకాకుండా.. చార్మినార్, ఇందిరా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ మీటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో..నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలు నుండి రాత్రి 8 వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. పురానాపూల్, ముసబౌలి, లాడ్ బజార్, చార్మినార్ మీదుగా పాద యాత్ర కొనసాగనుందని.. సౌత్ జోన్‌లో 3 గంటలు నుండి 6 వరకు ట్రాఫిక్ ఉంటుందని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వివరించారు.
అఫ్జల్‌గంజ్, మొహంజాయి మార్కెట్, గాంధీ భవన్, పోలీస్ కంట్రోల్ రూమ్, రవీంద్ర భారతీ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ , ఐమాక్స్ మీదుగా పాదయాత్ర ఉంటుందని చెప్పారు. ఇందిరా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్.. పాదయాత్ర జరిగే 3 కిలో మీటర్ల రేడియస్‌లో ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్.