బీజేపీకి కోమట్టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై ? – విజయశాంతి సంచలన పోస్ట్‌

-

 

బీజేపీకి కోమట్టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై ? చెప్పనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వార్తలపై విజయశాంతి సంచలన పోస్ట్‌ చేశారు. కోమట్టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బిజెపి నుండి వెళ్తారని పత్రికలల్ల వార్తలు రాస్తున్నారని ఆగ్రహించారు. కొన్ని ఆవేశ ప్రేరిత సందర్భాలలో ఇలాంటి నిర్ణయాలు బయటకు అనిపించవచ్చు.

బిజెపి అనే మహావ్యవస్థలో ఇలాంటి అంశాలను ఆ నేతలు కూడా భారత దేశ భవిష్యత్తు 30/40 సంవత్సరాల లక్ష్య చేరికను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించుకోగలగడం, పరిణితి కలిగిన వారికి తప్పక అవగతం అవుతుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. ఇక కొన్ని సందర్భాలలో బిజెపి ధోరణి ఉండేటోల్లం కాంగ్రెస్‌లో ఉండలేమని… అట్లానే కాంగ్రెస్ విధానాలలో పని చేసిన వాళ్ళకి బిజెపి సర్దుబాటుగా అనిపించకపోవచ్చని చురకలు అంటించారు.ఏది ఏమైనా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందో… ఎన్నికల అనంతరమో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం సర్దుబాట్లు ఒక,పక్క… బిజెపి ఒక పక్క అన్నట్లు నడుస్తాయన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version