అర్వింద్ ఇంటిపై దాడి..విజయశాంతి ఫైర్

-

అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఎలాంటి అరాచక, అనాగరిక పరిస్థితులు నెలకొన్నయో నిన్న జరిగిన పరిణామాలు స్పష్టంగా చెబుతున్నయి. విమర్శలకు జవాబు చెప్పడం చేతగాక ప్రజాప్రతినిధి అయిన ఎంపీ అర్వింద్ గారి ఇంటిపై గూండాలతో దాడి చేయించడo దారుణమన్నారు.

వారి తల్లిగారిని బెదిరించడం, ఆ ఇంటివారిని భయభ్రాంతుల్ని చెయ్యడం చూస్తుంటే రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని వేరే చెప్పాల్సిన పని లేదు. మహిళా రక్షణ అని పదే పదే చెప్పుకునే టీఆరెస్ సర్కారు ఇక ఆ మాట ఎత్తే అర్హతను పూర్తిగా కోల్పోయింది. గర్వం పెరిగిపోయి రోజులు దగ్గర పడినప్పుడే ఇలాంటి పెడబుద్దులు పుట్టుకొస్తాయని హెచ్చరించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version