వ్యాపారవేత్త రాహుల్‌ హత్య కేసులో 13 మంది నిందితులు !

-

విజయవాడ : రాహుల్‌ హత్య కేసులో షాకింగ్‌ నిజాలు బయటపెట్టారు పోలీసులు. ఈ కేసు పై విజయవాడ CP బత్తిన శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 18న సాయంత్రం కరణం రాహుల్ హత్య జరిగిందని… 19 వ తేదీ ఉదయం కారులో డెడ్ బాడీ దొరికిందన్నారు. కాల్ డేటా ఆధారం గా హత్యలో ఎవరు ఉన్నారో తెలుసుకున్నామని… వ్యాపారాల్లో కోరాడ విజయ్ కుమార్ తో రాహుల్ కు గొడవలు ఉన్నాయని వివరించారు. చాగర్ల గాయత్రి అనే మహిళతో కలిసి కోరాడ చిట్స్ వ్యాపారం చేసాడని… ఎన్నికల్లో పోటీ కోరాడ ఆర్థికం గా నష్టపోయాడని పేర్కొన్నారు.

కోగంటి ద్వారా తన వాటా కోసం కోరాడ రాహుల్ పై ఒత్తిడి తెచ్చాడని… గాయత్రి కుమార్తెకు మెడికల్ సీటు ఇస్తానని రాహుల్ 6 కోట్లు తీసుకున్నాడన్నారు. ఈనెల 18 రాత్రి 7.30 గంటలకు వివాదం సెటిల్ చేసుకుందాం అని రాహుల్‌ ను పిలిచారని.. ఆ తర్వాత పథకం ప్రకారం చంపారని వివరించారు. కోగంటి సత్యం సమక్షంలో డాక్యుమెట్ల పై సంతకాలు తీసుకున్నారని… రవికాంత్ అనే వ్యక్తి కోరాడ కు షల్టర్ ఇచ్చారని సీపీ వివరించారు.

ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులు ఉన్నారని….అందులో 7 గురిని అరెస్ట్ చేశారన్నారు. గాయాత్రిని రాహుల్ మోసం చేసాడని… హత్యలో పాల్గొన్న వారికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉందని షాకింగ్‌ నిజాలు తెలిపారు. కోగంటి దగ్గర ఉండి సంతకాలు పెట్టించారని… తరువాత ఫినిష్ చెయ్యమని కోగంటి చెప్పారన్నారు. ఇక ఇప్పటి వరకు కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్, కిలారి అనంత్ సత్యనారాయణ, షేక్ మహమ్మద్ జానీ, కాటారపు కోటేస్వరరావ్, కాటారపు గాంధీ బాబు, నల్లూరి రవి కాంత్ అరెస్ట్ అయ్యారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version