ఎప్పుడు రాజకీయాలతో బిజీ బిజీ గా ఉండే బెజవాడ ఇప్పుడు కరోనా దెబ్బకు అల్లాడిపోతుంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 23 కరోనా కేసులు నమోదు కావడం అధికంగా విజయవాడలోనే ఉండటంతో ఇప్పుడు బెజవాడ బెదిరిపోతుంది. కానూరు నుంచి భవానిపురం వరకు, బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు బందర్ రోడ్ నుంచి గాంధీ నగర్ వరకు ఎక్కడ చూసినా జనం కరోనా వైరస్ గురించే మాట్లాడుకునే పరిస్థితి ఉంది.
ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్ళిన వారి నుంచి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను జిల్లా అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అది కట్టడి కావడం ఇప్పుడు అధికారులకు పెద్ద తల నొప్పిగా మారింది. జిల్లా వ్యాప్తంగా కరోన విస్తరణ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తమైంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది.
ఇది పక్కన పెడితే విజయవాడ లో ముస్లిం లు ఎక్కువగా ఉండటం వారిలో ఎంత మంది ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారు ఉన్నారో అనేది ఇప్పుడు అధికారులకు భయం పట్టుకుంది. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్ళిన వారు స్వచ్చందంగా బయటకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన సరే వాళ్ళు మాత్రం బయటకు ఆవడానికి ఇష్టపడకపోవడం ఇప్పుడు ఆందోళన అందరిలోనూ నెలకొంది.
విజయవాడ జనం అయితే ఇళ్ళ నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇన్నాళ్ళు లాక్ డౌన్ ని లెక్క చేయని బెజవాడ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంటి నుంచి బయటకు రావొద్దని భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసినా సరే బయటకు రావొద్దని బెజవాడ వాసులు భావిస్తున్నారు. విజయవాడలో ఇప్పుడు కూరగాయలు కొనుక్కోవడానికి కూడా ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు.