కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా వినేశ్ ఫోగాట్ పోటీ..!

-

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్‌‌, సహచర రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. తాజాగా వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను కలిశారు వినేష్ ఫొగట్, భజరంగ్ పునియా. మరోవైపు రెజ్లర్ వినేష్ ఫొగట్ రైల్వేలో తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీని కలిసారు. కాంగ్రెస్ లో చేరి హర్యానా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

కష్ట కాలంలో మన వాళ్ళు ఎవరనేది తెలుస్తుంది. కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని వినేష్ ఫొగట్, భజరంగ్ పునియా మీడియాతో పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు చేసే వారికి మద్దతుగా బీజేపీ ఉందన్నారు. మావెంట మిగతా పార్టీలన్నీ కూడా ఉన్నాయి. మా సమస్యలను రాజకీయం చేస్తున్నామని  బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు మద్దతుగా ఉంటామని వీరు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు ప్రకటించింది వినేష్ ఫొగట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version