వింత: ఈ ఊరులో ఏకంగా మూడు సార్లు అమ్మాయికి పెళ్లి చేస్తారట మీకు తెలుసా..?

-

మన చుట్టూ మనం ఎన్నో రకాల వింత సంప్రదాయాలను చూసే ఉంటాం. పెళ్లిళ్లు మొదలు చాలా వాటిలో వింత పద్ధతుల్ని ప్రజలు ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ వింత సంప్రదాయాన్ని చూశారంటే అవాక్కవుతారు. నిజానికి ఆ ఊరిలో ఆడపిల్ల పుడితే పండగే. అయితే వారికి చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తారు. పైగా కట్నాలు, కానుకలు కూడా ఉండవు. ఈ పెళ్లి లో మరొక విచిత్రం ఏమిటంటే వారిని కనీసం మగవారి చేతుల్లో పెట్టరు. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి గ్రామంలో ఈ వింత ఆచారం కొనసాగుతోంది.

 

అక్కడ ఉండే మాలీ వారు తరతరాల నుండి ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. గ్రామంలో ఉండే బాలికల అందరికీ కూడా ఒకేసారి వివాహం జరిపిస్తారు. ఒడిస్సా నుండి ఈ తెగ విశాఖ ఏజెన్సీ కి వలస వచ్చారు. వీళ్ళు అక్కడ కూరగాయలు పండిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. నిజానికి ఈ తెగ ఆచారాలు కట్టుబాట్లు చాలా విభిన్నంగా ఉంటాయి.

ఈ తెగలోని ఆడపిల్లలుకి ఐదేళ్ల రాగానే వివాహం చేసేస్తారు. మగ పిల్లలు అస్సలు వివాహంలో ఉండరు. కేవలం బాలికల్ని కూర్చోబెట్టి పెళ్లి చేసేస్తారు. పైగా ఒకసారి కాదు మూడు సార్లు పెళ్లి చేస్తారు. బాలిక పుట్టిన తర్వాత ఒకసారి, ఐదేళ్ల తర్వాత ఒకసారి, యుక్తవయసు వచ్చాక మూడోసారి ఇలా మూడు సార్లు వివాహం జరిపిస్తారు. ఈ వివాహం చేసేటప్పుడు ఊరంతా పిలిచి భోజనాలు పెడతారు.

మరో వింత సాంప్రదాయం ఏమిటంటే ఈ తెగకు సంబంధించిన అబ్బాయి లేదా అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడితే వివాహం జరిపిస్తారు. పైగా కట్నాలు కానుకలు కూడా ఉండవు. పెళ్లి ఎలా జరుగుతుంది అంటే అమ్మాయి కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఐదుగురు అబ్బాయి ఇంటికి వెళ్తే పెళ్లి అయిపోయినట్లే. ఇంక ప్రత్యేకించి పెళ్లి చెయ్యక్కర్లేదు. ఇదే అక్కడ పూర్వ కాలం నుండి వస్తున్న ఆచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version