కారులో చిన్న పిల్లలు ఉన్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కుదురుగా ఉండరు కాబట్టి ప్రతీ నిమిషం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే అది వారి ప్రాణాలకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత బిజీ గా ఉన్నా సరే ఒక కంట గమనిస్తూనే ఉండాలి. ఇలా చేయకే ఒక బాలుడి ప్రాణం మీదకు వచ్చింది తాజాగా. ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఐపిఎస్ ఆఫీసర్ పంకజ్ నయన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే, వేగంగా వెళ్తున్న కారు బ్యాక్ డోర్ సడెన్‌గా తెరచుకోవడంతో డోర్‌ని ఆనుకొని కూర్చున్న చిన్నారి రోడ్డు మధ్యలో పడిపోయింది. అనూహ్యంగా ఈ ప్రమాదం నుంచి చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ కారు ఉన్న ప్రాంతం మలుపు కావడంతో వెనక వచ్చే వాహన డ్రైవర్ వెంటనే తన వాహనాన్ని స్లో చేయడంతో ఆ చిన్నారి ప్రాణాల నుంచి బయటపడింది.
ఆ చిన్నారి స్వల్ప గాయాలతో, ప్రాణాలతో బయటపడి౦ది. 31 సెకండ్ల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, డోర్లు లాక్ చేసుకోవడం ఇవన్నీ తప్పనిసరిగా పాటించాల్సిన రూల్స్. లేదంటే మన ప్రాణాలకే ప్రమాదం అని పంకజ్ నయన్ ట్వీట్ చేశారు డిసెంబర్ 26న యూట్యూబ్‌లో తొలిసారి ఈ వీడియో కనిపించింది. ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ వీడియో.
Child lock and child seats are very important when travelling with childrens. Check all doors are closed properly, and child lock is on. Always make sit children in a child restraint seat. All kids wont be as lucky as this one. #Staysafe #Roadsafety pic.twitter.com/qfnf1rMrox
— Pankaj Nain IPS (@ipspankajnain) January 9, 2020