వైర‌ల్ వీడియో: కారుపై ఎక్కిన ఏనుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

-

థాయ్‌లాండ్ లోని ఖావో యాయ్ నేషనల్ పార్క్ లోని డ్యూయా అనే 35 ఏళ్ల ఊహించని విధంగా వ్యవహరించింది. అటుగా రోడ్డుపైకి వచ్చిన కారు ఏనుగుకు చిక్కింది. ఒక్కసారిగా ఏనుగును చూసిన డ్రైవర్ కు ఏమి చేయాలో తోచక నిలిపివేశాడు. ఇక ఆ కారుపై ఎక్క‌డానికి ప్ర‌య‌త్నించిందా ఏనుగు. కారు పైకి ఎక్కడం చేతకాగ దానిపై అడ్డంగా పడిపోయి రెండు కాళ్లు పెట్టేసింది. దీంతో కారులో ఉన్న డ్రైవర్ కు పట్టపగలే చుక్కలు కనిపించాయి.

ఇక ఏనుగు నుంచి ఎలా తప్పించుకోవాలా అని స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు ఆ డ్రైవ‌ర్‌. కానీ.. ఏనుగు మాత్రం రెండు కాళ్ల మధ్యన కారును ఉంచి తెగ‌ భ‌య‌పెట్టింది. కాసేపటిదాకా వెయిట్ చేసిన డ్రైవర్.. ఏనుగు కాలు దూరంగా జ‌ర‌ప‌డంతో వెంట‌నే జారుకున్నాడు. మొత్తానికి గండం తప్పించుకుని ఏనుగు కింద నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ క్ర‌మంలోనే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇందంతా క్ష‌ణాల్లోనే జ‌రిగిపోయింది.అయితే ఈ సంఘటన జరిగినప్పుడు కారులో ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలియదు గానీ.. వారికి తృటిలో ప్రమాదం త‌ప్పింద‌ని అనుకోవాలి.

థాయిలాండ్‌లోని ఖావో యాయ్ నేషనల్ పార్కులో మంగళవారం ఈ తతంగం జరిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మార‌డంతో డ్రైవర్ ధైర్యానికి మొచ్చుకోవాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వాస్త‌వానికి ఇలాంటి సంగ‌ట‌న‌లు ఇంత‌కుముందు చాలానే జ‌రిగాయి. అయితే ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రయాణికులు జంతువులకు ఆడమ దూరంలో ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version