సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో జరుగుతున్న కొన్ని వింతలు ఇప్పుడు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఒక రాతిపై నల్ల జీవి ఒకటి ఒకటి కనపడింది. అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని తదేకంగా గమనించారు. అది ఏంటీ అనేది ఎవరికి అర్ధం కాలేదు. దాన్ని పట్టుకుని లాగగా అది ముడుచుకుపోతుంది.
వారం క్రితం ట్విట్టర్ యూజర్ ఒకరు దీన్ని పోస్ట్ చేసారు. 14 సెకన్ల వీడియో లో ఒక రాయి మీద వింతగా ఉన్న జీవి తారులా జారిపోతుంది. అది ఒక వింత పురుగులా ఉంది. ఇది ఏంటో మీకు ఎవరికి అయినా తెలుసా అని సన్నీ యార్కేడ్ అనే యూజర్ అడిగారు. ఈ వీడియోని ఇప్పటి వరకు 19.5 మిలియన్ల మంది వీక్షించారు. ఒక యూజర్ ఆసక్తికరమైన కామెంట్ చేసారు. ఇప్పటికే మేము చాలా కష్టాలు పడుతున్నామని…
మాకు గ్రహాంతర జీవులు అవసరం లేదని పేర్కొన్నారు. కొందరు దాన్ని అందమైన కుక్క పిల్లలా అభివర్ణించారు. వాస్తవానికి ఈ జీవి ఏమిటో చాలా మందికి అర్ధం కావడం లేదు. సిబిఆర్.కామ్ ప్రకారం, ఈ జీవి పేరు బూట్‌లేస్ పురుగు – 180 అడుగుల పొడవు వరకు పెరిగే ప్రపంచంలోనే పొడవైన జంతువులలో ఇది ఒకటి. పురుగు ఒక విషపూరిత శ్లేష్మాన్ని స్రవిస్తుంది, అది రెచ్చగొట్టినప్పుడు అది కరుస్తుందని పేర్కొన్నారు.
Anybody know what this is? pic.twitter.com/B2dQLTm4td
— stimulus package (@sunnyarkade) April 2, 2020