జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఇటీవల విశ్వక్రీడా సంబురం ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. ఈ ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించేందుకు గాను భారత ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఒలింపిక్స్‌ను అబ్జర్వ్ చేస్తున్నారు. పర్టికులర్ స్పోర్ట్‌లో విజయదుందుభి మోగించి తమ దేశ కీర్తి ప్రపంచానికి చాటి చెప్పేందుకు గాను పార్టిసిపెంట్స్ వెయిట్ చేస్తున్నారు.కరోనా వల్ల జనాల ఫిజికల్ ప్రజెన్స్ స్టేడియంలో ఎక్కువగా లేకపోయినా అందరూ డిజిటల్‌గా ఒలింపిక్స్‌ను వీక్షిస్తున్నారు. కాగా, ఈ క్రీడలను ప్రజలతో పాటు జంతువులు చూస్తున్నాయి అని చెప్పేందుకు మనం తెలుసుకోబోయే ఈ ఘటనే ఉదాహారణ. ఒలింపిక్స్ ప్లేయర్స్‌ను అనుకరిస్తూ వారిని చూస్తూనే ఉండిపోయే పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ట్రెండవుతోంది.
సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న వీడియో ప్రకారం..ఓ ఇంటిలో టెలివిజన్ ముందు కూర్చున్న ఓ పిల్లి జిమ్నాస్ట్ ప్రదర్శనను కాన్సంట్రేషన్‌తో చూస్తోంది. టీవీలోని జిమాస్ట్ కదలికలకు అనుగుణంగా అనుకరిస్తుంది. ఈ క్రమంలోనే డిజిటల్ తెర ఎటు వైపుగా మారితే అటు వైపునకు పిల్లి తన తలను కూడా ఆడిస్తుంది. అంతటితో ఆగకుండా తన చేతులతో జిమ్నాస్ట్‌ను పట్టుకునేందుకు క్యాట్ ప్రయత్నిస్తుంది. రెండు చేతులను టీవీ మీదకు పెట్టి జిమ్నాస్ట్‌తోపాటు అటు ఇటు తిరుగుతూ హుషారుగా కనిపిస్తోంది. 54 సెకన్ల నిడివిగల ఈ వీడియోను హ్యూమర్ అండ్ ఎనిమల్స్ అనే ట్విట్టర్ పేజ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిమ్నాస్ట్‌కు సాయం చేసేందుకు క్యాట్ సాయం చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్ వ్యూస్ రాగా, ఇంకా వైరలవుతోంది.
cats watching gymnastics is my new favorite
(teenybellinitheprettypittie IG) pic.twitter.com/aZjQBoqJBB— Humor And Animals (@humorandanimals) July 28, 2021