వైరల్‌ వీడియో: పిలవని పెళ్లికి వచ్చాడని ఎంబీఏ విద్యార్థితో గిన్నెలు కడిగించారు..!

-

ఇంటికి వచ్చినవాడు శత్రువైనా వారిని గౌరవించే సంప్రదాయం మనది..అయితే చాలామందికి పిలవని పేరంటానికి వెళ్లి తినే అలవాటు ఉంటుంది. కొందరికి అయితే ఇది క్రేజీ విష్‌గా కూడా ఉంటుంది. లైఫ్‌లో ఒక్కసారి అయినా ఇలా వెళ్లి తినాలని.. ఇంకొందరు అయితే పాపం తినడానికి లేక అలా వెళ్తుంటారు. మరి ఇక్కడ ఓ ఎంబీఏ స్టూడెంట్‌ అయితే ఇలానే పిలవని పెళ్లికి వెళ్లాడు. తిన్నాడు..పాపం అదే తను చేసిన తప్పు అయింది.. ఆహ్వానించిన వ్యక్తులకే మర్యాద ఇవ్వాలనుకున్నారేమో ఆ కుటుంబంలో వాళ్లు..నిన్ను ఎవడ్రా పిలిచింది అని..అతనితో గిన్నెలు కడిగించారు. పైగా వీడియో కూడా తీయడంతో.. ఇప్పుడా ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కి చెందిన ఓ యువకుడు భోపాల్‌లో ఎంబీఐ చదువుతున్నాడు. పెళ్లి ఇంట్లో భోజనం ఉచితంగా లభిస్తుందన్న కారణంతో ఎంబీఏ విద్యార్థి ఆహ్వానం లేకుండానే ఆ పెళ్లికి వచ్చాడు. అయితే పెళ్లి కుటుంబం అతనికి విచిత్రమైన శిక్ష విధించింది. ఉచితంగా భోజనం దొరుకుతుందని ఆహ్వానం లేకుండా వచ్చాడని గిన్నెలు కడిగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో..పెళ్లింటివారు ఆ విద్యార్ధిని ఉద్దేశించి ‘మీ తల్లిదండ్రులు ఎంబీఏ చదువుతున్న నీకు డబ్బులు పంపలేదా?ఇదంతా చేసి జబల్‌పూర్‌కు చెడ్డపేరు తెస్తావా అని గట్టిగా అరిచారు. అంతేకాదు, ‘పాత్రలన్నీ కడిగిన తర్వాత నీకు ఎలా అనిపిస్తోంది’ అని ప్రశ్నించగా.. ‘భోజనం తిన్నందుకు ప్రతిఫలంగా ఈ పని చేస్తున్నాను’ అని విద్యార్థి చెప్పాడు. ఈ తతంగం అంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో.. నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరైనా ఆహ్వానం లేకుండా వివాహ వేడుకలకు హాజరుకావడం నేరం కాదని… భోజనానికి వచ్చిన యువకుడితో బలవంతంగా మిగిలిపోయిన గిన్నెలు కడిగించటం సరికాదంటూ కామెంట్స్ చేశారు. మిగిలిపోయిన గిన్నెలు కడిగించి బలవంతంగా వీడియో తీసిన వారిని అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. మీరేమంటారు.. ఇక్కడ తప్పు ఎవరిది..పిలవని పెళ్లికి భోజనం చేసిన విద్యార్థిదా లేక ఇలా శిక్ష వేయించిన వారిదా..?

Read more RELATED
Recommended to you

Exit mobile version