వైరల్ వీడియో; యజమాని పక్కన పడుకుని కుక్క ఏం చేస్తుందో చూడండి…!

-

కుక్కలకు మనుషులకు మధ్య మంచి సంబంధాలు ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే. అవి మనుషులతో చాలా సన్నిహితంగా ఉండటమే కాకుండా మన జీవితంలో కూడా కీలక పాత్ర పోషించే సందర్భాలు కూడా ఉంటాయి. తాజాగా ఒక తన యజమానికి తెలియకుండా పక్కన పడుకుని వ్యాయామం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతుంది.

వీడియోలో, ఒక మహిళ గోడకు ఆనుకుని, తల క్రిందికి పెట్టి వ్యాయామం చేస్తుంది. ఆమె పక్కన ఒక వ్యక్తి కుర్చీపై కూర్చుని, పేపర్ చదవడం లో బిజీ గా ఉంటాడు. ముందు వీడియో చూడగానే జనాలకు అర్ధం కాలేదు. వీళ్ళు సాధారణంగా నేలపై పడుకున్నారని అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కఠిన వ్యాయామం చేస్తున్నారనే విషయం అర్ధమైంది. అప్పుడు వారి పక్కన ఉన్న కుక్క కూడా అలాగే చేస్తుంది.

అది కూడా వ్యాయామం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. మంగళవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియోను ఫేస్‌బుక్ యూజర్ పాలిన్హో మార్టిన్స్ షేర్ చేసాడు. ఈ వీడియోని ఇప్పటి వరకు 5.4 మిలియన్ల మంది చూసారు. 2 లక్షలకు పైగా ‘షేర్లు’ మరియు 10,000 కామెంట్స్ వచ్చాయి. కుక్క మనుషులను ఎంతలా ఫాలో అవుతుందో తెలిపే వీడియో అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version