తండ్రయిన విరాట్ కోహ్లీ..

Join Our COmmunity

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్కశర్మ పండంటి పాపకి జన్మనిచ్చింది. ఆమె ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ప్రసవం కోసం జాయిన్ అయింది. డెలీవరి టైమ్ సమీపించడంతో వైద్యుల సూచన మేరకు ముందుస్తుగానే అనుష్క ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. అనుకున్నట్టుగానే ఆమెకు కొద్ది సేపటి క్రితం డెలివరీ అయింది. ఈ విషయన్ని కోహ్లీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని, ఆయన పేర్కొన్నారు.

తమ మీద అభిమానులు చూపిస్తున్న ప్రేమకు, ధన్యవాదాలు తెలిపారు. విరాట్ కోహ్లీ అనుష్క డెలివరీ సమయం దగ్గర పడడంతోనే ఆస్ట్రేలియా సిరీస్ ను కూడా వదులుకుని ఇండియా వచ్చేశాడు. అప్పట్లో కోహ్లీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వగా.. మెజార్టీ టీం సభ్యులు విరాట్‌ కు అండగా నిలిచారు. ఇక ఆగస్టులో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన విరాట్.. ‘జనవరి మేం ముగ్గురం కాబోతున్నాం’ అని ట్వీట్ చేశాడు. అన్నట్టుగానే ఈరోజు ఆయన తండ్రి అయ్యాడు.

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news