హరీశ్ రావు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు..!

-

తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఎస్ఐఆర్ ను కొట్టివేయాలంటూ మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు లాయర్లు కేసు వాదిస్తారని పీపీ, పిటిషనర్ తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇరువురు చర్చించుకుని తేదీ చెప్పాలని హైకోర్టు సూచించింది. అనంతరం విచారణను ఈ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. కాగా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి హరీశ్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో హరీశ్ రావుతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు.

దీంతో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఎస్ఐఆర్ రద్దు చేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాది చక్రధర్ గౌడ్ కు గతంలో హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ పై తాజాగా ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. ఈ కేసులో ఫిబ్రవరి 05 వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. దీంతో మాజీ మంత్రి హరీశ్ రావుకు కాస్త ఊరట కలిగించే అంశం అనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news