వైజాగ్ లో మ్యాచ్ అంటే కోహ్లికి పండగే… ఇదే ట్రాక్ రికార్డ్…!

-

మూడు వన్డేల సీరీస్ లో భాగంగా భారత్ విండీస్ జట్ల మధ్య… విశాఖ వేదికగా బుధవారం రెండో వన్డే జరగనుంది… తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన టీం ఇండియా తమకు అచ్చు వచ్చిన… విశాఖలో కరేబియన్లకు చుక్కలు చూపించాలని భావిస్తుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా సీరీస్ ని సమం చెయ్యాలనే పట్టుదలతో టీం ఇండియా ఉన్నట్టు తెలుస్తుంది. అటు విండీస్ జట్టు కూడా… టి20 సీరీస్ లో ఎదురైన పరాభవానికి ఈ మ్యాచ్ గెలిచి సీరీస్ ని దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది… ఇందుకోసం గట్టిగానే శ్రమిస్తున్నారు.

టీం ఇండియా బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉండటం, ఈ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించడంతో టాస్ గెలిస్తే మాత్రం భారీ స్కోర్ సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. అటు విండీస్ కూడా తొలి వన్డేలో టీం ఇండియాకి తాము ఏమీ తక్కువ కాదని నిరూపించింది. ఇదిలా ఉంటే… ఈ పిచ్ కెప్టెన్ కోహ్లీకి కలిసి వచ్చిన పిచ్… 2010 అక్టోబర్ లో ఆసిస్ తో జరిగిన మ్యాచ్ లో 121 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 118 పరుగులు చేయగా… టీం ఇండియా… ఈ మ్యాచ్ లో 5 వికెట్లతో విజయం సాధించింది.

2011 డిసెంబరులో విండీస్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 123 బంతుల్లో… 14 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో కూడా టీం ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత ఏడాది నవంబర్ లో విండీస్ తో జరిగిన మ్యాచుల్లో 100 బంతుల్లో 99 పరుగులు చేసి సెంచరి ముంగిట అవుటయ్యాడు. అలాగే… గత ఏడాది జరిగిన మరో మ్యాచ్ లో విండీస్ పై… ఇదే వేదికగా 157 పరుగులు చేయగా… ఆ మ్యాచ్ డ్రా అయింది. ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన అన్ని మ్యాచుల్లో కోహ్లీ సెంచరి సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news