మళ్లీ మైదానంలోకి సెహ్వాగ్, గంభీర్.. కానీ ఈసారి ప్రత్యర్థులుగా ..

-

సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ తదుపరి ఎడిషన్ కోసం డాషింగ్ ఆటగాడు, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ బ్యాట్ హట్టబోతున్నాడు. చాలా కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న వీరును ఎల్ ఎల్ సి లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ గా ఎంచుకుంది.

ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ, మళ్ళీ బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి దిగుతానన్నా అనుభూతి చాలా సంతోషాన్ని కలిగిస్తుందని అన్నాడు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, జట్టు ఎంపిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. మరోవైపు ఈ టోర్నీలో పాల్గొనోబోయే మరో కొత్త జట్టు ఇండియా క్యాపిటల్స్, వీరు సహచరుడు, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version