బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..

విశాఖను వరుస అగ్ని ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే రకరకాల ప్రమాదాలతో ఇబ్బంది పడుతున్న విశాఖపట్నంలో ఈ రోజు మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ టి పి పి 2 లో టర్బన్ ఆయిల్ లీక్ అవడంతో భారీగా మంటలు చెలరేగి 12 1.5 మెగావాట్ల విద్యుత్ మోటార్లు దగ్ధం అయినట్టు సమాచారం.

అయితే ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి టర్బన్ ఆయిల్ లీక్ కావడం ఒక్కటే కారణమా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ అధికారులు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్టీల్ ప్లాంట్ కి చేరుకుని మండల అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల భారీ విద్యుత్ మోటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ప్రాణ నష్టం ప్రస్తుతానికి ఏమీ లేనట్టు చెబుతున్నా భారీగా ఆస్తి నష్టం మాత్రం చోటుచేసుకుంది సుమారు రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్లు స్టీల్ ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.