విజ‌య‌మ్మ ఆత్మీయ భేటీ వెనక అస‌లు ఎజెండా ఏంటి..

-

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అశేష ప్రజలు అభిమానులుగా ఉన్నారు. ఆయన ప్రోద్బలంతో నేతలుగా ఎదిగిన చాలా మంది రాజకీయ నాయకులు ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఈ సంగతులు పక్కనబెడితే వైఎస్ విజయమ్మ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేళ నిర్వహించబోయే ఆత్మీయ భేటీ విషయమై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

vijayamma

వైఎస్ఆర్ పన్నెండో వర్ధంతి వేళ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం వెనుక ఆంతర్యమేమిటోననే చర్చ షురూ అయింది. ఈ ఆత్మీయ భేటి కడపలోనో గుంటూరులోనో కాకుండా తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విజయమ్మ రాజకీయ ఎత్తుగడలు ఏమైనా వేయబోతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా కరోనా వేళ ఇడుపులపాయలో ట్రాన్స్‌పోర్ట్ ఇష్యూస్ ఉంటాయనే హైదరాబాద్‌లో భేటీ ప్లాన్ చేసినట్లు కొందరు చెప్తున్నారు.

రాజకీయాలకు అతీతంగానే ఈ భేటీ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ మీటింగ్ ద్వారా విజయమ్మ తన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదనే అంచనా కు వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ భేటీ ఎజెండా ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. కానీ, సుమారు 300 మంది వరకు ఈ భేటీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వీరందరికీ ఇన్విటేషన్స్ ఆల్రెడీ ఇచ్చినట్లు సమాచారం. మరి.. వీరిలో ఎంతమంది వస్తారనేది మీటింగ్ అయితే చెప్పలేం. వైఎస్ విజయమ్మ కుమారుడు జగన్మోహన్‌రెడ్డి వైఎస్ఆర్‌సీపీ అధినేతగా ఏపీ ముఖ్యమంత్రిగా ఉండగా, కూతురు షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ స్థాపించి తెలంగాణను తన రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నది. ఇటీవల షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. కాగా తన కూతురు తన మద్దతు ఉంటుందని విజయమ్మ గతంలో ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version