విశాఖ ఉక్కు అమ్మేదెవడు.. కోనేదెవడు ?

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కార్మిక సంఘాలు భగ్గు మంటున్నాయి. ఈ రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు మహా ధర్నా కార్యక్రమం చేపట్టారు.. విశాఖపట్నం కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గరకి భారీగా కార్మికులు చేరుకుంటున్నారు. ‘విశాఖ ఉక్కు అమ్మే దెవడు కొనేది ఎవడు’ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, సేవ్ స్టీల్ ప్లాంట్  అనే నినాదాలతో మెయిన్ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దాకా కార్మికులు మోటర్ సైకిల్ ర్యాలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మహా ధర్నా నిర్వహించనున్నాయి కార్మిక సంఘాలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సేవ్ స్టీల్ ప్లాంట్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మోడీ ప్రైవేటీకరణ నశించాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక వీరికి మద్దతుగా ఓల్డ్ గాజువాక జంక్షన్ నుంచి టిడిపి బైక్ ర్యాలీ చేస్తోంది. ఈ అంశం రోజురోజుకి ఉధృతం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news