ప్రభాస్ పెళ్లి తో తన పెళ్లి ని ముడి పెట్టేసిన విశాల్..

-

తెలుగువాడైనప్పటికే తమిళంలోనే హీరోగా స్థిరపడిపోయాడు విశాల్. అయితే ఈయన తెలుగు వారికి కూడా పరిచయమే.. పందెంకోడి, డిటెక్టివ్, అభిమన్యు వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు.. ఇతని సినిమాలు తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తూనే ఉన్నాయి. అయితే విశాల్ పెళ్లి పైన ఇప్పటివరకు ఎన్నో చర్చలు జరిగాయి అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిని హీరో ప్రభాస్ పెళ్లి తో ముడి పెట్టేసాడు ఈ హీరో..

 

హీరో విశాల్ ఇప్పటికీ తన పెళ్లి కోసం ఒక క్లారిటీ ఇవ్వలేదు.. 45 ఏళ్ల విషయాలకి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కి చెందిన అనూష ఆళ్ల అనే అమ్మాయిని విశాల్ పెళ్లి కూడా చేసుకునేలా కనిపించాడు. కానీ.. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. పెళ్లి మాత్రం ఆగిపోయింది. మళ్లీ ఇప్పటి వరకూ మళ్లీ పెళ్లి టాపిక్ ఎత్తడం లేదు. తాజాగా అతను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకున్న విశాల్.. పెళ్లి కోసం ఆసక్తికర కామెంట్స్ చేశాడు..

అయితే విశాల్ ప్రస్తుతం ఓ నటితో డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్న ఉండటంతో ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు ఈ హీరో అయితే ఆమె పేరు మాత్రం చెప్పేందుకు ససేమిరా అన్నాడు… విశాల్ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే నటి ‘అభినయ’ పేరుని ప్రస్తావించగా.. ఆమె కాదని స్పష్టం చేశాడు. అభినయ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. కానీ చాలా వరకూ హీరోల చెల్లెలు పాత్రలే ఆమెకి దక్కాయి. కానీ తమిళ్‌లో మాత్రం ఆమె ఇప్పుడు చాలా బిజీ నటి. తాను పెళ్లి చేసుకోబోయే కొత్త అమ్మాయిని త్వరలోనే మీకు పరిచయం చేస్తానని విశాల్ స్పష్టం చేశాడు. అలాగే విశాల్ గత నాలుగేళ్లుగా పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి దేనికో ఒకదానికి ముడిపెడుతూనే వస్తున్నాడు. అయితే తాజాగా హీరో ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ రోజునే నేను కూడా పెళ్లి చేసుకుంటానంటూ ఈ ప్రశ్నకు సమాధానాన్ని దాటేశాడు..

Read more RELATED
Recommended to you

Exit mobile version