Vishal31 : ”సామాన్యుడు” వచ్చేస్తున్నాడు

-

తెలుగు వాడు అయినా కోలీవుడ్‌లో తిరుగులేని స్టార్ స్టేట‌స్ సొంతం చేసుకున్నాడు విశాల్‌. కెరీర్‌ లో 30 సినిమాలలో నటించిన విశాల్‌ వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించాడు విశాల్. ప్రస్తుతం తన 31 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. విశాల్‌ బర్త్‌ డే నేపథ్యం లో 31 వ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది.

విశాల్‌ నటిస్తున్న ఈ సినిమాకు ”సామాన్యుడు” అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాకు నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ టైటిల్‌ కు సంబంధించిన పోస్టర్‌ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. శరవణన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈదు థెవైయో అధువే ధర్మం అనే షార్ట్‌ ఫిల్మ్‌ తో మంచి టాలెంటెడ్‌ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న శరవణన్‌ విశాల్‌ 31 వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీని విశాల్‌ ఫిలిం ప్యాకట్‌ రి బేనర్‌ పై నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news