టీచ‌ర్ అభ్యుర్థుల‌కు మంత్రి గుడ్ న్యూస్..పోస్టులు త‌గ్గ‌వు…!

-

విద్యాసంస్థ‌ల రీ ఓపెనింగ్ పై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు జారీచేసింది. క‌రోనా ను దృష్టిలో పెట్టుకుని స్కూల్స్ లో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశామ‌ని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సంబితా ఇంద్రారెడ్డి అన్నారు. పాఠ‌శాల‌లు తెరిచాక విద్యార్థులు త‌ల్లిదండ్రులు ఆనందంతో ఉన్నార‌ని అన్నారు. అంతే కాకుండా ఆన్ లైన్ క్లాసులు ఆఫ్ లైన్ క్లాస్ ల‌కు ప్ర‌త్యామ్నాయం కాద‌ని స‌బితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రైవేటు విద్యాసంస్థ‌లు ట్యూష‌న్ ఫీజును మాత్ర‌మే తీసుకోవాల‌ని కోరారు. ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంచామ‌ని…మాస్క్ లు ఇచ్చే ఏర్పాట్లు చేశామ‌ని అన్నారు. టీచ‌ర్ల హేతుబ‌ద్దీక‌ర‌ణ వ‌ల్ల స్కూల్స్ త‌గ్గ‌డం కానీ టీచ‌ర్ పోస్టులు త‌గ్గ‌డం కానీ ఉండ‌ద‌ని స‌బితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో టీచ‌ర్ అభ్య‌ర్థుల్లో నెల‌కొన్న ఆందోల‌న దూరమ‌య్యింది. ఇక ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు కూడా త్వ‌ర‌లో నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news