విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లైగర్’కు సీక్వెల్..

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ కానున్నారు. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ పై ఫ్యాన్స్ ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ గత చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే ‘లైగర్’ డెఫినెట్ గా అలరిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఫుల్ మసాలా ఫిల్మ్ ‘లైగర్’ అని పూరీ జగన్నాథ్ పేర్కొంటున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఇందులో కీలక పాత్ర పోషించగా, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ సైతం కీ రోల్ ప్లే చేశారు. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్యా పాండే నటించింది. కాగా, ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుండగా, అప్పుడే ఈ చిత్ర సీక్వెల్ గురించి ‘లైగర్’ చిత్రంలో విలన్ గా నటించిన విషురెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘లైగర్’ ఫిల్మ్ కు పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ బజ్ క్రియేట్ అయిందని విషురెడ్డి తెలిపాడు. ఇందులో తాను గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశానని, విజయ్ దేవరకొండతో కలిసి బాక్సింగ్ నేర్చుకున్నానని చెప్పాడు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ స్టోరిని కూడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెడీ చేసి ఉంచారని వివరించాడు.

‘లైగర్’ ఫిల్మ్ సక్సెస్ కాబోతున్న నేపథ్యంలో పూరీ జగన్నాథ్ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తారని విషురెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తెలుసుకుని విజయ్ దేవరకొండ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన(జేజీఎం)’ విజయ్ దేవరకొండతో చేస్తున్నారు. ఒక వేళ ‘లైగర్’ కు సీక్వెల్ చేస్తే కనుక పూరీ జగన్నాథ్.. వరుసగా తన మూడు సినిమాలను విజయ్ దేవరకొండతోనే చేసినట్లవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version