తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల

-

తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం నిర్వహించిన టీఎస్‌ లాసెట్‌ ఫలి‌తాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా‌మం‌డలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ ప్రొఫె‌సర్‌ వెంక‌ట‌ర‌మణ, ఓయూ వైస్‌ చాన్స్‌‌లర్‌ ప్రొఫె‌సర్‌ డీ రవీం‌దర్‌ ఫలితాలను విడు‌దల చేశారు. అభ్యర్థులు ర్యాంకు కార్డులను వెబ్‌‌సై‌‌ట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు సమర్పించి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మూడేళ్లు, అయిదేళ్ల పీజీ లాసెట్‌ జులై 21, 22 తేదీల్లో జరిగింది. ఈ పరీక్షలకు మొత్తం 35,538 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,921 మంది హాజరయ్యారు. కాగా.. మూడేళ్ల లా సెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్‌లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ లా సెట్‌లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ లాసెట్‌లో అర్హత సాధించాలంటే 35 శాతం కనీస మార్కులు తప్పనిసి. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 42 మార్కులు సాధించిన వారిని ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రవేశపరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. మార్కుల సమానమయ్యే అభ్యర్థులకు సెక్షన్-సిలో వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా సమమైతే అభ్యర్థుల వయోపరిమితి ఆధారంగా తుదిజాబితాను విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు అవసరంలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version