VishwakSen : “ఓరి దేవుడా” అంటూ వచ్చేసిన విశ్వక్

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్న హీరో లు చాలా తక్కువగా ఉంటారు. ఫలక్ నుమా దాస్… సినిమాతోనే పెద్ద స్టార్ అయిపోయాడు విశ్వక్ సేన్. చేసింది మొదటి సినిమా అయినప్పటికీ… యాక్టింగ్ లో ఎక్కడ తగ్గకుండా కుమ్మేశాడు విశ్వక్. ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో యువతలో గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్.

ఇటీవలే పాగల్‌ సినిమాతో మంచి విజయం అందుకున్న విశ్వక్‌ సేన్‌ మరొక సినిమాను అనౌన్‌ చేశాడు. ఈ సారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వేక్‌. “ఓరి దేవుడా” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వచ్చేసాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ మేరకు మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.

ఓరి దేవుడా సినిమాకు వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా శ్రీ వెంకటేశ్వర అ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటిస్తుండగా మిథిలా పల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు అశ్వత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా… ఇటీవలే.. గామి అనే సినిమాను విశ్వక్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version