సీఎం అయ్యాక సాఫ్ట్ అయ్యారనుకుంటున్నారా..? లోపల ఒరిజినల్ అలాగే ఉంది- మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వరసగా నేతలు కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూడా తనదైన శైలిలో బీజేపీకి వార్నింగ్ లు ఇచ్చారు. ’సీఎం అయ్యాక సాఫ్ట్ అయ్యారనుకుంటున్నారా..? లోపల అలాగే ఉంది‘ అనే సినిమా డైలాగ్ చెబుతూ బీజేపీని హెచ్చిరించారు. 20 ఏళ్లు కాదు మరో 80 ఏళ్లు టీఆర్ఎస్సే రాజకీయ శక్తి అని..తమదే అధికారం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వరసగా ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ పార్టీకి వార్నింగ్ లు , కౌంటర్లు ఇస్తుండటం చూస్తుంటే మరోసారి మాకు ఉద్యమ నాయకుడు కనిపించాడని అన్నారు కేటీఆర్. తెలంగాణ తెచ్చినం.. కేంద్రం మెడలు వంచడం పెద్ద విషయం కాదు అని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో రైతులం పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు. అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ పథకాలను చూపిస్తూ బీజేపీ అధ్యక్షుడు ఫోజులు ఇస్తున్నాడని.. తెలంగాణ పథకాలకు బండి సంజయే బ్రాండ్ అంబాసిడర్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version