ఈ రోజు జరిగిన విటాలిటీ బ్లాస్ట్ సెమీఫైనల్ 1 లో మొదట బ్యాటింగ్ చేసిన హాంప్ షైర్ నిర్ణీత ఓవర్ లలో వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఒక దశలో పరుగులు అయినా చేస్తుందా అన్న స్థితి నుండి పోరాడగలిగే స్కోర్ ను సాధించింది. అందులోనూ ఎస్సెక్స్ బ్యాటింగ్ లో మొదట్లోనే వికెట్ సాధించి విజయం వైపుకు దూసుకు వెళ్లేలా కనిపించిన హాంప్ షైర్ ను వరుణుడు అడ్డుకున్నాడు. 3 ఓవర్ ల సమయంలో వర్షం పడడంతో అంపైర్లు లక్ష్యాన్ని 12 ఓవర్ లకు 115 పరుగులుగా నిర్దేశించారు. ఇది ఎస్సెక్స్ కు బాగా కలిసి వచ్చింది, వచ్చిన బ్యాట్స్మన్ ఒకటే లక్ష్యంగా ఫోర్ సిక్సు కొడుతూ వెళ్లారు.. అలా మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చెందించి సగర్వంగా ఫైనల్ కు వెళ్లారు. ఈ ఛేదనలో క్రిట్చ్లీ మరియు సామ్స్ లు కీలక సమాయంలో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.
వర్షం కారణంగా హాంప్ షైర్ విజయావకాశాలు దెబ్బ తిన్నాయి. ఒకవేళ పూర్తి ఓవర్ లు ఆట కొనసాగి ఉంటే హాంప్ షైర్ గెలిచే అవకాశాలు ఉండేవి.