ఈ ఆరు రకాల ఉద్యోగాలు చేసే వారికి క్యాన్సర్‌ ముప్పు ఎక్కువేనట..

-

ఏ పని చేసినా దాని ఆంతర్యం డబ్బు సంపాదించడం కోసమే ఉంటుంది. అయితే కొన్ని కేవలం పైసలు కోసమే అయితే.. మరికొన్ని మనకు ఆ పని అంటే ఇష్టం.. ఇందులో కూడా డబ్బు వస్తుంది చేసేద్దాం అని కొంతమంది చేస్తుంటారు. అయితే మీకు తెలిసే ఉంటుంది.. కొన్ని జాబ్స్‌లో ప్రజర్‌ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడికి జీవితం అంటే విరక్తి వస్తుందని. అందులో మెయిన్‌గా ఉండేది ఈ సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌.. ఛీ ఇదేం జీవితంరా బాబు అనుకోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉండడు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అయితే కొన్ని జాబ్స్‌ వల్ల ఒత్తిడి మాత్రమే కాదు.. బోనస్‌గా క్యాన్సర్‌ కూడా వస్తుందట. అవేంటో.. అందులో మీ జాబ్‌ కూడా ఉందేమో చూసేయండి..!

హెయిర్ డ్రెస్సర్ గా పని చేసేవారికి వారి వృత్తిలో ఉపయోగించే రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది. బార్బర్ షాపులు, బ్యూటీ సెలూన్లలో 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా పనిచేస్తున్నవారికి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది.

బార్బర్ షాపులు
బ్యూటి సెలూన్లు
నిర్మాణ కార్మికులు
అకౌంటెంట్లు
డ్రెస్ మేకర్స్ లేదా ఎంబ్రాయిడరీ పని చేసేవారు
సేల్స్, రీటైల్ వర్కర్లు

హెయిర్ డ్రెస్సింగ్ వృత్తిలో ఉన్న మహిళలు హెయిర్ డైలు, షాంపూలు, కండీషనర్లు, స్టైలింగ్‌కు వాడే కాస్మొటిక్ ఉత్పత్తులతో సహా ఎక్కువ మొత్తంలో క్యాన్సర్ కలిగించే రసాయనాలు కలిగిన వస్తువులతో పనిచేస్తుంటారు.

బ్యూటీ సెలూన్లలో పనిచేసేవారు 12 రకాల క్యాన్సర్ కారక రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంటారు వారికి క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని కెనడాకు చెందిన మాంట్రియల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ తెలిపారు.

పరిశోధన ఎలా జరిగింది..?

ఈ అధ్యయనంలో 2010 నుంచి 2016 మధ్య కెనాడలో మాంట్రియల్లో ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 419 మహిళల నుంచి డేటా సేకరించారు. ఈ డేటాను క్యాన్సర్ బారిన పడని 897 మంది మహిళలతో పోల్చి వారి ఉద్యోగాలు, ఇతర ఆరోగ్య చరిత్ర, సాధారణ ఆరోగ్యం వంటివన్ని పరిగణనలోకి తీసుకుని పరిశీలించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ద్వారా క్యాన్సర్ తో సంబంధం ఉన్న 18 రకాల రసాయనాలను గుర్తించారు. వీటిలో అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, హెయిర్ డస్ట్, పాలిస్టర్ ఫైబర్స్, ఫార్మాల్డిహైడ్, ప్రొపెల్లెంట్ వాయువులు, పెట్రోల్ ఈ 18 రకాల రసాయనాల్లో ఉన్నాయి.
ఈ రసాయనాలు డీఎన్ఏ లోపలికి చొచ్చుకెళ్తాయి.. లేదా డీఎన్ఏతో చేరి ప్రతిస్పందించడం ద్వారా క్యాన్సర్‌కు కారణం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news