వివో నుంచి వై50 స్మార్ట్‌ఫోన్‌.. ఫీచ‌ర్లు అద్భుతం..

-

మొబైల్స్ త‌యారీదారు వివో.. త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వై50ని భార‌త్‌లో మంగ‌ళ‌వారం విడుదల చేసింది. ఈ ఫోన్ చైనాలో ఇప్ప‌టికే విడుద‌ల కాగా ప్ర‌స్తుతం వివో దీన్ని భార‌త్‌లోనూ లాంచ్ చేసింది. ఇందులో 6.53 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐవ్యూ డిస్‌ప్లే, 8జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్లను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌ను జూన్ 10వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,990 ధ‌ర‌కు విక్ర‌యించ‌నున్నారు.

వివో వై50 స్పెసిఫికేష‌న్లు…

* 6.53 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐవ్యూ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
* 13, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version