రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్ మాజీ గుఢచారి క్రిస్టోఫర్ స్టీల్ ప్రకటించిచారు. గతంలో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలో కూడా యూఎస్ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని స్టీల్ ప్రకటించారు. రష్యా అధినేత పుతిన్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల పుతిన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న రష్యన్ ఓలిగార్చ్, రష్యా నాయకుడు మధ్య సంభాషన లీక్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఉక్రెయిన్ పై దాడికి ఆదేశించడానికి కొద్దిసేపటి ముందు పుతన్ కు బ్లడ్ క్యాన్సర్ కారణంగా శస్త్రచికిత్స జరిగిందనదే వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం క్షీణిస్తోందని వార్తలు వస్తున్నాయి. గత వారం జరిగిన విక్టరీ డే వేడుకలతో సహా పలు బహిరంగ సమావేశాల్లో పుతిన్ చాలా వీక్ గా కనిపించారు. పుతిన్ ఆరోగ్యం క్షీణించడం వల్లే తాత్కాలికంగా కరడుగట్టిన భద్రతామండలి చీఫ్, మాజీ ఫెడరల్ సెక్యురిటీ సర్వీస్ కమాండర్ నికోలాయ్ పెత్రుషేవ్ కు అధికారాన్ని అప్పగించినట్లు తెలుస్తోంది.