మీ శ‌క్తి లేక‌పోతే మేం చేసేది ఏం లేదు : కేసీఆర్‌

-

ఎన్నిక‌ల్లో ఓటును అల‌వోక‌గా వేయొద్దు.. మీ త‌ల‌రాత మార్చేది.. భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ఇల్లందు చాలా ఉద్య‌మాలు జ‌రిగిన ప్రాంతం.. చాలా చైత‌న్యం ఉండే ప్రాంతం.. పోరాటాల పురిటిగ‌డ్డ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎల‌క్ష‌న్లు వ‌చ్చిన‌ప్పుడు పార్టీకి ఒక‌రు నిల‌బ‌డుతారు. బీఆర్ఎస్ త‌ర‌పున హ‌రిప్రియ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ త‌ర‌పున ఎవ‌రో ఒక‌రు నిల‌బ‌డుతారు.

న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌రిగేది ఖాయం.. డిసెంబ‌ర్ 3న‌ ఎవ‌రో ఒక‌రు గెలిచేది ఖాయం. స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు గుడ‌స్తుంది. రాజ‌కీయ ప‌రిణితి, ప్ర‌జాస్వామి ప‌రిణితి రావాల్సిన అస‌వ‌రం ఉంది. ఇది గంభీర‌మైన స‌మ‌స్య‌. ఒక ఒర‌వ‌డిలో కొట్టుకుపోకుండా, పైస‌ల‌కు, ప్ర‌లోభాల‌కు ఓటు వేయొద్దు. మీరు ఆలోచించి చైత‌న్యంతో నిజ‌మేదో ఆలోచించి ఓటు వేయాలి. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గెలిచే స్థితి రానంత వ‌ర‌కు ఈ దేశం ఇలానే ఉంట‌దని కేసీఆర్ అన్నారు. మీ త‌ల‌రాత మార్చేది.. భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే. హైద‌రాబాద్‌లో మేం ప‌ని చేస్తున్నామంటే అది మీరు ధార‌పోసిన శ‌క్తే. మీ శ‌క్తి లేక‌పోతే మేం చేసేది ఏం లేదు. ఓటు వేసే ముందు నిజ‌మైన పంథా ఎంచుకోవాలి అని కేసీఆర్ సూచించారు.

ఏపీ వాళ్లు చీకట్లో ఉన్నారు.. మన దగ్గర వెలుగు ఉందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. సత్తుపల్లిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..‘‘ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ, తెలంగాణ రోడ్లను పరిశీలించాలి. డబుల్‌ రోడ్‌ వస్తే మనది.. సింగిల్‌ రోడ్‌ వస్తే వాళ్లది. ఏపీ ధాన్యం తెలంగాణలో అమ్ముకుంటున్నారు. సత్తుపల్లి చాలా చైతన్యం ఉన్న ప్రాంతం. సత్తుపల్లిలో 70 వేల మెజార్టీతో సండ్ర గెలుపు ఖాయమైంది. ఎన్నికలు చాలా వస్తాయి.. పోతాయి.. నిలబడే అభ్యర్థి ఎవరు.. అతని పార్టీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలి.కేసీఆర్‌ రాకముందు దళితబంధు ఉన్నదా? అన్ని పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగా వాడుకున్నాయి. దళితుల శ్రేయస్సు గురించి ఎవరూ ఆలోచించలేదు. దళితుల శ్రేయస్సు గురించి ఎవరూ ఆలోచించలేదు. ఎందుకీ వివక్ష.. ఎందుకు వాళ్లపై దాడులు?. హుజూరాబాద్‌లో 100శాతం దళితబంధు అమలు చేశాం. ఆరునూరైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది.. బీఆర్ఎస్ పార్టీయే. ఖమ్మం జిల్లాకు చెందిన నేత అహంకారంతో మాట్లాడుతున్నారు అని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version