రాష్ట్ర వ్యాప్తంగా 50 సభలకు వైఎస్ఆర్టీపీ సన్నాహాలు

-

ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండటంతో వైఎస్ఆర్టీపీ దూకుడు పెంచేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. 2023 నవంబర్ 06న పాలేరులో నామినేషన్ వేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 సభలకు వైఎస్ఆర్టీపీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది. నవంబర్ 1వ తేదీ నుండి నియోజకవర్గంలో షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు.


పాలేరులో ఈ సారి టఫ్ ఫైట్ కనిపించబోతుంది. బీఆర్‌ఎస్ తరపున కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్టీపీ నుంచి షర్మిల పోటీలో ఉండటంతో పాలేరు పోరు రసవత్తరంగా మారనుంది. కామారెడ్డి, గజ్వేల్ తరువాత పాలేరు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కలిగించే నియోజకవర్గంగా మారనుంది.

ఇది ఇలా ఉంటె, తెలంగాణ ఎన్నికల బరిలో నిలబడుతుందా లేదా అన్న సందేహంలో ఉన్న తెలంగాణ వైస్సార్ పార్టీకి ఎన్నికల సంఘం ‘బైనోక్లర్’ గుర్తును కేటాయించింది. అసలు తెలంగాణాలో ఆ పార్టీ ఉనికి ఉందా లేదా అనేది షర్మిల అదే బైనోక్లర్ తో వెతికి చూసుకోవాల్సిన పరిస్థితే అంటున్నారు అక్కడి రాజకీయ నాయకులు. తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు తమతమ ప్రచారంలో దూసుకుపోతుంటే షర్మిల మాత్రం తన పార్టీ తరుపున పోటీ చేయడానికి అభ్యర్థుల కోసం బైనోక్లర్ సాయంతో వెతుకుతున్నారనే చెప్పాలి. తెలంగాణాలో పాలేరు నియోజకవర్గం నుండి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాలని చూస్తున్న షర్మిలకు ఈ గుర్తు కలిసి వస్తుందా, రాదా?అనేది కాలమే చెప్పాలి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version