Good News : ఇక కళ్లజోడుకు చెప్పండి స్వస్తి.. మార్కెట్లోకి సరికొత్త ఔషధం

-

కళ్లు కనిపించక చత్వారం వ్యాధితో ఇబ్బందులు పడుతున్న వారి కోసం సరికొత్త ఔషధం మార్కెట్లోకి వచ్చేసింది. చుక్కల మందు రూపంలో అందుబాటులోకి వచ్చిన దీనిని కంటిలో వేసుకున్న 15 నిమిషాలకే కళ్లలో మసకపోయి కంప్యూటర్, ఫోన్ తెరలను స్పష్టంగా చూడగలుగుతారు. అలాగే పుస్తకాలు, పేపర్లను ఎంచక్కా చదువుకోగలుగుతారు. నిజానికి 40 ఏళ్లు వచ్చాక చాలామందిలో చత్వారం (ప్రెస్బయోపియా) వస్తుంది.

Vuity passes FDA approval; new eye drops could limit the need for reading  glasses - ABC7 San Francisco

ఇదొచ్చిన వారు కళ్లజోడు అవసరం లేకుండా పుస్తకాలు చదవలేరు. దీంతో ఇలాంటి వారి కోసం ‘వ్యూటీ’ చుక్కల ముందు అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చింది. కన్ను పనిచేసే తీరును బట్టి ఈ చుక్కల మందు పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌డీఐ అనుమతితో చత్వారాన్ని సరిచేసే తొలి చుక్కల మందుగా ‘వ్యూటీ’ రికార్డులకెక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news